: 'బ్రహ్మోత్సవం' నిడివి తగ్గించమని చెప్పిన మహేష్!


తాను నటించిన తాజా చిత్రం నిడివి ఎక్కువగా ఉండటంతో కొంత కట్ చేయాలని మహేష్ బాబు స్వయంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు సూచించినట్టు తెలుస్తోంది. చిత్ర నిడివి మూడు గంటలు ఉండటంతో, తెలుగు సినీ ప్రేక్షకులు అంతసేపు థియేటర్లలో కూర్చునేందుకు ఇష్టపడటం లేదని భావించిన మహేష్, ఈ సూచన చేయగా, దానికి ఓకే చెప్పిన శ్రీకాంత్, నిడివిని 2 గంటలా 20 నిమిషాలకు తగ్గించే దిశగా కొన్ని కామెడీ సీన్స్ తీసేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో గతంలో ఎన్నడూ లేనంత శ్రద్ధను మహేష్ చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు టీవీ చానల్స్ లో ప్రత్యేక ఇంటర్వ్యూలలో హీరోయిన్లు, దర్శకుడితో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విశేషాలు చెబుతూ ఆసక్తిని పెంచుతున్నాడు.

  • Loading...

More Telugu News