: మీరు మా మిత్రులు!... బాగా కష్టపడతారు!: చంద్రబాబుతో నరేంద్ర మోదీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని ముందు చంద్రబాబు ఏకరువు పెట్టారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. చంద్రబాబు వాదనను సాంతం విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు మా మిత్రులు. బాగా కష్టపడతారు. మీకు బాగా అనుభవం ఉంది’’ అంటూ ప్రధాని చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాని తన వ్యక్తిగత మిత్రుడిగానూ అభివర్ణించారు.