: వేధింపుల నిర్మాత అరెస్ట్ కు పోలీసుల పాట్లు
వివాహిత మహిళను వేధింపులకు గురిచేసిన తెలుగుదేశం పార్టీ నేత మాగంటి బాబు కుమారుడు, 'తూనీగ తూనీగ' చిత్ర నిర్మాత రామచంద్రన్ (రాంజీ) అరెస్ట్ వ్యవహారం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. తనను కాల్స్, మెయిళ్ల ద్వారా వేధించాడంటూ రామచంద్రన్ పై హైదరాబాద్ కు చెందిన మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రామచంద్రన్ ను అరెస్ట్ చేసి తీసుకురావడానికి సైబర్ విభాగం పోలీసులు ఏలూరు వెళ్లారు. కానీ, మాగంటి బాబు కుటుంబ సభ్యులు రామచంద్రన్ ను అప్పగించేందుకు నిరాకరించారు. సోమవారం అప్పగిస్తామని చెప్పారు. అయితే, నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలంటూ పోలీసులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.