: నగ్న ఫోటోల వ్యవహారంపై స్పందించిన ఎంపీ తోట నరసింహం
బాలల నగ్న ఫొటోలు పంపిణీ చేస్తున్నారంటూ ఎంపీ తోట నరసింహంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ లో నమోదైన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తనపై న్యాయవాది ఎస్.రవి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో తెలియదని తోట నరసింహం అన్నారు. న్యాయవాది రవిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. పబ్లిసిటీ పిచ్చితో ఆయన ఇలా తనపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.