: డిసెంబర్ వరకు సెక్రటేరియట్ తరలింపు లేనట్టే!
డిసెంబర్ వరకు ఏపీ సెక్రటేరియట్ తరలింపు లేనట్టేనని తెలుస్తోంది. అమరావతిలో నిర్మిస్తున్న ఏపీ సెక్రటేరియట్ భవనాల స్ట్రక్చర్ పూర్తయినప్పటికి డ్రైయినేజీ వ్యవస్థ పూర్తి కాలేదని సీఆర్డీయే ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇతర నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అమరావతిలో డ్రైనేజీ వ్యవస్థకు ఇంకా టెండర్లు కూడా పిలవలేదని ఐఏఎస్ ల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల తరలింపులో చూపుతున్న ఉత్సాహం, వాస్తవంగా నెలకొన్న పరిస్థితులపై బ్యూరోక్రాట్లకు అజయ్ జైన్ వివరించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు, ఇబ్బందులపై ఏసీ సీఎస్ ఠక్కర్ ను కలవాలని ఐఏఎస్ ల అసోసియేషన్ నిర్ణయించింది.