: అనకాపల్లికి, అమరావతికి తేడా తెలియని వ్యక్తి సోము వీర్రాజు: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ మండిపాటు


అనకాపల్లికి, అమరావతికి తేడా తెలియని వ్యక్తి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అవడం చాలా దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే తాము రాజధానికి నిధులు అడుగుతున్నామన్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని లక్షల కోట్లు ఎవరూ అడగలేదని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేరిస్తే చాలని ఆయన అన్నారు. కాగా, ఏ రాష్ట్రమూ రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని, ఏపీ రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు అడగడం విడ్డూరంగా ఉందంటూ సోము వీర్రాజు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News