: కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ ఖర్మ...నా పరిస్థితి ఇదా?: చంద్రబాబు


ఒక మనిషిని చంపేసి క్షమాపణలు అడిగితే తప్పు మాఫీ అయిపోతుందా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన సందర్భంగా ఏపీకి ఏమిస్తున్నారో చెప్పలేదని, విభజన తరువాత రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో వివరించలేదని దుయ్యబట్టారు. 'ఒక ముఖ్యమంత్రి పదేపదే కేంద్రాన్ని అడుక్కోవాలా? నాకేంటీ పరిస్థితి?' అని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను పదేపదే ఢిల్లీ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘట్టాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉందన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు అయినా సరే అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదని ఆయన తేల్చిచెప్పారు. గతంలోనే తాము ఈ విషయాన్ని చెప్పామని ఆయన తెలిపారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రాజెక్టులు కట్టుకుంటే పాలసీలు ఎందుకని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News