: ఎల్లుండి ఓ పెద్ద వార్తను మీతో పంచుకుంటాను, అప్పటి వరకు సస్పెన్స్: ట్విట్టర్లో కేటీఆర్
‘ఎల్లుండి ఓ పెద్దవార్త మీతో పంచుకుంటాను... అప్పటివరకు సస్పెన్స్’ అంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కొద్ది సేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రజలను పెద్ద సస్పెన్స్‌లో పెట్టేశారు. ఏకంగా సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి ఇటువంటి పోస్ట్ చేయడం పట్ల ఆ సస్పెన్స్ ఏమై ఉంటుందోనని నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏపీ, తెలంగాణకు మధ్య సాగునీటి ప్రాజెక్టుల విభేదాల అంశం, పాలేరు ఉప ఎన్నిక ఇటీవలే జరిగిన అంశాలు ప్రస్తుతం కొనసాగుతోన్న నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తిని పెంచుతోంది.