: శ్రీశాంత్ జోస్యం...కేరళలో బీజేపీకి 70కి పైగా సీట్లు!


స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో టీమిండియాలో చోటు కోల్పోయి, టీవీ నటుడిగా మారి, అటు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్ కేరళలో బీజేపీకి 70కి పైగా సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నాడు. కేరళలో ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ బోణీ కొట్టలేదు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటుగానీ సాధించలేకపోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా కేరళలో పాగా వేయాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా సినీ నటుల ప్రచారంపై కొండంత ఆశలు పెట్టుకుంది. అలాగే శ్రీశాంత్‌ విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నట్టు కనబడుతోంది. పోలింగ్ తరువాత ఎర్నాకులంలో శ్రీశాంత్‌ మాట్లాడుతూ 'నేను చాలా ఆశావాదిని. బీజేపీకి 70కిపైగా సీట్లు వస్తాయి' అన్నాడు. అంతా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ గురించే మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు బీజేపీకి ఓట్లు వేసిన వారి గురించి ఎవరు మాట్లాడాలని ప్రశ్నించాడు. అయితే కేరళలో ఎల్డీఎఫ్ విజయం సాధిస్తుందని, బీజేపీ నామమాత్రపు పార్టీగా మిగులుతుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News