: ఈ కార్లన్నీ ప్రమాదమే... క్రాష్ టెస్టులో సున్నా మార్కులు తెచ్చుకున్న క్విడ్, సెలేరియో, ఈకో, స్కార్పియో, ఇయాన్!


కార్లకు ఏవైనా ప్రమాదాలు జరిగితే, అవి ఎంతవరకూ తట్టుకుంటాయి? ఎంత వేగంతో వచ్చిన వాహనం ఢీకొంటే, ఏ కారు ఏ మేరకు నిలుస్తుంది? ఈ పరీక్షలను నిర్వహించే గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూ కార్ ఎసైన్ మెంట్ ప్రోగ్రామ్) సంస్థ తాజా ఫలితాల్లో ఇండియాలో పేరున్న ఎన్నో కార్లు సంతృప్తికర ఫలితాలను ఇవ్వలేదు. ఎన్నో ఫేమస్ మోడల్ కార్లు సున్నా మార్కులు తెచ్చుకున్నాయి. రెనాల్ట్ క్విడ్ కారును మూడు వర్షన్లలో పరీక్షించగా, మూడు సార్లూ అందులోని వారు ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేదని వెల్లడైంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు సైతం ప్రాణాలు కాపాడే నాణ్యతతో లేదని తెలుస్తోంది. ఒక్క రెనాల్ట్ క్విడ్ మాత్రమే కాదు, మహేంద్రా స్కార్పియో, మారుతి సుజుకి సెలేరియో, ఈకో, హ్యుందాయ్ ఇయాన్ లు సైతం తమ పరీక్షల్లో ఘోరంగా విఫలమయ్యాయని ఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ పేర్కొన్నారు. ఇండియాలో సూపర్ కార్లుగా పేర్కొనే మోడళ్లన్నీ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను హరించేవేనని హెచ్చరించారు. ఏమాత్రం దృఢత్వం వాటిల్లో లేదని, ఎయిర్ బ్యాగులు ఉన్నా అవి ఉపయుక్తకరం కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News