: పెట్రోలు విషయంలో గోవాలో బీజేపీ మాట నిలబెట్టుకుంది


గోవాలో బీజేపీ మాటనిలబెట్టుకుంది. 2012 ఎన్నికల సందర్భంగా లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలు దాటనిచ్చే పరిస్థితి లేదని బీజేపీ హామీ ఇచ్చింది. గత అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్ పై 83 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గోవాలో లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలు దాటింది. అయితే, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు గోవా ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించి పెట్రోల్ ధర 60 రూపాయలు మించకుండా చూసింది. దీంతో గోవాలో లీటర్ పెట్రోల్ ధర 59.70 రూపాయలుగా ఉంది. 2012లో అధికారం చేపట్టిన బీజేపీ వెంటనే పెట్రోల్ పై వ్యాట్ ను రద్దు చేసింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 11 ఒక్కసారిగా తగ్గింది. అయితే గోవా ఖజానాకు 150 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుండడంతో నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ వ్యాట్ విధిస్తోంది.

  • Loading...

More Telugu News