: ఏపీకి నిధుల మంజూరుపై బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: సురవరం


ప్రత్యేక హోదా ఇవ్వ‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు భారీగా నిధులు మంజూరు చేశామంటూ బీజేపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల‌కు ఎన్డీఏ ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు మంజూరు చేసిన నిధుల‌పై స్ప‌ష్ట‌తనిస్తూ శ్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల‌కు మంజూరైన నిధుల‌పై కూడా శ్వేత ప‌త్రం ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ‘కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగానే నిధులు వ‌స్తున్నాయి కానీ కేంద్ర ప్ర‌భుత్వ నేత‌లు త‌మ సొంత డ‌బ్బుని ఇవ్వ‌డం లేద‌’ని సురవరం వ్యాఖ్యానించారు. క‌ర‌వుతో బాధ‌ప‌డుతోన్న ప్రాంతాల పట్ల కూడా కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News