: రూ. 511ల ప్రారంభ ధరతో స్పైస్ జెట్ టికెట్లు... గురువారం వరకే చాన్స్!


లోకాస్ట్ ఎయిర్ వేస్ సంస్థ స్పైస్ జెట్ మరోసారి ఆఫర్ సేల్ ప్రకటించింది. తాము విమానాలు నడిపే రెండు నగరాల మధ్య రూ. 511ల ప్రారంభ ధరతో (పన్నులు అదనం) టికెట్లను అందిస్తామని తెలిపింది. సంస్థ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ ను అందిస్తున్నామని, గురువారం వరకూ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ సమయం జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఎంచుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో అంతర్జాతీయ రూట్లలో రూ. 2,111ల ప్రారంభ ధరతో టికెట్లు ఇస్తామని, ప్రయాణ తేదీ జూన్ 1 నుంచి జూలై 20 మధ్య ఎంచుకోవాలని ప్రకటించింది. తొలుత బుక్ చేసుకున్న వారికి తొలుత ప్రాతిపదికన వీటిని విక్రయిస్తామని స్పైస్ జెట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News