: హస్తిన చేరిన చంద్రబాబు... మరికాసేపట్లో ప్రధానితో భేటీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. నేటి ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం ఎక్కిన చంద్రబాబు... కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ల్యాండయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు... తన వెంట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు ఒకరిద్దరు కీలక శాఖల అధికారులను తీసుకుని వెళ్లినట్లు సమాచారం. మరికాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీరు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై చర్చ తర్వాత ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలుపై చంద్రబాబు గళం విప్పనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News