: నితీశ్ కోపానికి జడిసి లొంగిపోయిన మనోరమా దేవి


హత్యకేసులో ఇరుక్కున్న కుమారుడిని మూడు రోజుల పాటు దాచడంతో పాటు, ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు ఉంచుకున్నారన్న ఆరోపణలపై బీహార్ లో సస్పెండైన మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి ఈ ఉదయం పోలీసులకు లొంగిపోయారు. నిన్న మీడియా సమావేశంలో, మీ పార్టీ వారే క్రిమినల్ కేసుల్లో ఎందుకు ఎక్కువగా ఇరుక్కుంటున్నారన్న ప్రశ్న, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, ఆపై గంటల వ్యవధిలోనే మనోరమ లొంగిపోవడం గమనార్హం. కోర్టు ఎదుట లొంగిపోయిన ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కోర్టు వద్ద మనోరమ వాపోయారు. కాగా, ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని, ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేయనున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, గత మూడు రోజులుగా మనోరమ అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని నితీశ్ ముందు మీడియా ఉంచగా, "ఈ ప్రశ్నకు అర్థం ఏంటి? అడగటంలో ఆంతర్యం ఏంటి? నేను ఆమెను దాచానా? లేక ఎవరైనా దాచారని మీ ఉద్దేశమా? ఆమె పోలీసులకు పట్టుబడలేదంటే నేనే కారణమా? నేను కూడా జైల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారా? నేను ఎవరిపైనా జాలి చూపడం లేదు" అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News