: మరోసారి పెరిగిన 'పెట్రో' ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల మార్పు చేర్పులకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. ఈ ధరల మార్పుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది. కాగా, ఈ నెలలో పెట్రో ధరల పెంపు ఇది రెండవసారి కావడం గమనార్హం. ఈ నెల 1వ తేదీన పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ.2.94 పెరిగిన విషయం తెలిసిందే.