: బెంగాల్ లో మమతను ఢీ కొట్టే మగాడే లేడు


పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను ఢీ కోట్టే పార్టీ లేదని తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఐదు దఫాలుగా సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో మమతా బెనర్జీని ఎలాగైనా అధికారం నుంచి దించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసింది. అయితే ఎంత ప్రయత్నించినా, ఎన్ని వ్యూహాలకు పదును పెట్టినా పశ్చిమ బెంగాల్ లో దీదీకి తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 167 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలుస్తోంది. వామపక్షాలు 75 స్థానాల్లో విజయం సాధించి రెండో పార్టీగా నిలవనున్నాయి. కాంగ్రెస్ 45 స్థానాల్లో విజయం సాధించి పరువు నిలుపుకోనుంది. బారీ ప్రచారం, భారీ ప్రణాళికలు, భారీ వాగ్దానాలు చేసిన బీజేపీ మాత్రం కేవలం 4 స్థానాలకు పరిమితం కాగా, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీంతో బెంగాల్ లో మమతా బెనర్జీని నమ్మినంతగా ఎవరినీ నమ్మలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News