: హైదరాబాద్ లో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం
హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఒక మహిళ అదృశ్యమైంది. ఈ సంఘటనపై మహిళ తల్లిదండ్రులు మొఘల్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బి.ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, లాల్ దర్వాజ నాగుల్ చింత ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ కుమార్తె స్నేహ(25), గచ్చిబౌలిలోని హిందుజా గ్లోబల్ సొల్యూషన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ఈ నెల 14 వ తేదీ సాయంత్రం తన ఆఫీసులో సమావేశం ఉందని చెప్పి వెళ్లింది. అయితే, ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కంగారుపడ్డారు. అన్ని చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.