: గుంటూరులో ఇద్దరు కామాంధులకు 22 ఏళ్ల జైలుశిక్ష


మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో ఇద్దరు కామాంధులకు 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు తీర్పు నిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు... గుంటూరులోని నల్ల చెరువుకు చెందిన దాసరి గౌరీశంకర్, షేక్ సుభానీలకు 2014న ఫిబ్రవరి 2వ తేదీన పేరేచర్ల వద్ద 23 సంవత్సరాల యువతి కనపడింది. అనాధ అయిన ఆ యువతికి మతిస్థిమితం లేదు, మాటలు కూడా రావు. తనకు కళ్లు కనిపించడం లేదని, గుంటూరులో వైద్యులకు చూపించుకునేందుకు వచ్చానని తనకు ఎదురుపడ్డ వాళ్లిద్దరికీ ఆమె చెప్పింది. దాంతో తాము ఆసుపత్రిలో చేర్పిస్తామంటూ ఆ యువతిని గౌరీశంకర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత గౌరీశంకర్, షేక్ సుభానీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు వాళ్లిద్దరిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ కేసులో జిల్లా న్యాయమూర్తి ఎస్ఎం రఫీ ఈరోజు తీర్పు వెలువరించారు. గౌరీ శంకర్, షేక్ సుభానీలను దోషులుగా తేల్చుతూ ఆయన తీర్పు చెప్పారు. దోషులకు 22 ఏళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News