: సల్మాన్, అభిషేక్ 'చిందులు' చూసి బాలీవుడ్ షాకయ్యింది!
బాలీవుడ్ లో పరిస్థితులను బట్టి కొంతమంది అనుకోని శత్రువులుగా మారిపోతుంటారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, జూనియర్ బచ్చన్ శత్రుత్వం కూడా అలాంటిదే. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు చోటుచేసుకోలేదు. కనీసం వారిద్దరూ మాటామాటా కూడా అనుకోలేదు. అయినా వారిద్దరూ శత్రువులయ్యారు. తాజాగా, ప్రీతి జింటా వివాహాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ప్రముఖులందరినీ ఈ విందుకి ఆహ్వానించింది. ఈ విందులో అభిషేక్ ఒంటరిగా రాగ, సల్మాన్ ప్రియురాలు లులియా వంతూర్ తో కలసి హాజరయ్యారు. వీరిద్దరూ ఓ సందర్భంలో ఎదురుపడ్డారు. వీరిద్దరూ ముఖాలు తిప్పుకుని వెళ్లిపోతారని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, వీరిద్దరూ పలకరించుకోవడమే కాకుండా, సల్మాన్, అతని ప్రియురాలితో అభిషేక్ ఓ స్టెప్పు కూడా వేయించాడు. దీంతో బాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. మరి దీనిపై కేన్స్ ఫెస్టివల్ లో ఉన్న ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఏమంటుందో చూడాలి అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. సల్మాన్ మాజీ ప్రేయసి ఐశ్వర్యారాయ్ ను అభిషేక్ వివాహం చేసుకున్న తరువాత వీరిద్దరూ ఎలాంటి విభేదాలు లేకుండానే శత్రువులైన సంగతి తెలిసిందే!