: ఛాటింగ్ చేయొద్దని చెప్పినందుకు భర్త చేతివేళ్లు కోసేసింది!
ఈవేళ సోషల్ మీడియాతో అనుబంధం పెంచుకోని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా చాటింగ్ చేయొద్దని చెప్పిన పాపానికి భర్త వేళ్లను కురగాయల్లా తరిగేసిందో ఇల్లాలు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో టీచర్ గా పని చేస్తున్న సునీతా సింగ్ కు సెల్ ఫోన్ వ్యసనంగా మారింది. ఆమె ఎప్పుడూ సెల్ ఫోన్ లో ఛాటింగ్ చేస్తూ ఉండడంతో ఆమె భర్త పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వివాదాలు రేగుతూనే ఉన్నా, ఆమె మాత్రం ఛాటింగ్ ఆపలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె భర్త చంద్రకాంత్ సింగ్...ఆమె ఫోన్ తీసి చూసి షాక్ తిన్నాడు. ఫోన్ ఛాటింగ్ లో డియర్, డార్లింగ్ అంటూ అవతలి వైపు నుంచి మెసేజిలు ఉన్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన చంద్రకాంత్ సింగ్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సరిగ్గా వంటగదిలో వంట చేస్తున్న ఆమె, భర్త తన ఫోన్ చూడడంతో ఆవేశానికి లోనైంది. దీంతో కిచెన్ లో కూరలు తరిగే చాకు తీసుకుని అతడి మూడు వేళ్లు కోసిపారేసింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, భార్యపై గృహ హింస కేసు పెట్టాడు.