: కడపలో దారుణం.. చికెన్ కోసం తండ్రి ప్రాణాలు తీసిన తనయుడు
మానవ సంబంధాల్లో ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, పెద్దల పట్ల గౌరవం రోజు రోజుకీ తరిగిపోతున్నాయి. చిన్న పాటి గొడవలకే ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం గుళ్లూరులో ఇటువంటి ఘటనే కనిపించింది. చికెన్ తేలేదంటూ గొడవ పడ్డ ఓ తనయుడు ఆవేశంలో తన తండ్రినే హతమార్చాడు. నిన్న చికెన్ తేలేదనే కారణంతో తన తండ్రి ఎల్లయ్యతో గొడవ పడిన ఓ వ్యక్తి.. ఆవేశంతో తనకు దగ్గరగా ఉన్న రోకలి బండతో ఎల్లయ్యను చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఎల్లయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.