: కేసీఆర్... ఎవడబ్బ సొత్తు ఇది?: ప్రశ్నించిన జగన్
కర్నూలు జిల్లాలో మూడు రోజుల జలదీక్షను చేపట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎగువన ఉన్నామన్న ఏకైక కారణంతో, గోదావరి జలాల్లో అధిక వాటాను బలవంతంగా తీసుకుంటూన్నారని ఆరోపిస్తూ, "కేసీఆర్ ఆయనిష్టం వచ్చినట్టుగా వాటా లెక్కలు చెబుతున్నారు. నేనడుగుతా ఉన్నా, ఇదే కేసీఆర్ గారిని... ఎవడబ్బ సొత్తబ్బా ఇది? అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవడు చెప్పాడయ్యా నీకు, గోదావరి నీటిలో 954 టీఎంసీల వాటా ఉందని? ఎవడూ చెప్పలా... ఆయనిష్టం వచ్చినట్టుగా... ఆయన ప్రాజెక్టులు కడతా ఉన్నాడు కాబట్టి... ప్రాజెక్టుల్లో నిల్వ ఉండే నీటిని లెక్కగట్టుకుని, ఇది నా అవసరం. ఇవీ నా కేటాయింపులు, నేనే ఈ నీళ్లు తీసుకుంటా, మిగిలితేనే మీకు పంపిస్తా అంటూ... ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్న తీరు... మీకు ధర్మమేనా అని చెప్పి నేను అడుగుతావున్నా" అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు ముందడుగు వేయకుంటే, రెండు రాష్ట్రాల మధ్యా 'భారత్, పాక్ సరిహద్దు' ఏర్పడుతుందని హెచ్చరించారు.