: ఆత్మహత్య చేసుకున్న 'ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్


అంతర్జాతీయ సంస్థ ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాకు సౌతాసియా డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసిన వినీత్ సింగ్, ఓ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సైబర్ ఏరియాలోని డీఎల్ఎఫ్ ఫేస్-3 సొసైటీ బిల్డింగ్ లోని 19వ అంతస్తు నుంచి ఆయన కిందకు దూకాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆయన వద్ద సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. డీఎల్ఎఫ్ బెల్వెదరీ పార్క్ అపార్టు మెంట్లలో తండ్రి, భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో కలసి ఆయన నివాసం ఉంటున్నారు. కుమారుడి మరణవార్త విని ఆయన తండ్రికి గుండెపోటు రాగా, ఆసుపత్రికి తరలించారు. పొద్దున్నే వినీత్ వాకింగ్ కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పాడని, ఆయన నిదానంగా నడుస్తాడని తెలిసిన కుటుంబ సభ్యులు ఇంకా వాకింగ్ లోనే ఉన్నాడని భావిస్తున్న వేళ, ఉదయం 9 గంటల సమయంలో అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ను శుభ్రం చేసేందుకు వచ్చిన కార్మికులు వినీత్ మృతదేహాన్ని గుర్తించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించామని వివరించారు.

  • Loading...

More Telugu News