: మీరిచ్చింది రూ.6 వేల కోట్లేగా?... మోదీ ముందు చిట్టా విప్పనున్న చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ పయనమవుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్ కింద ఎంత మేర నిధులు వచ్చాయన్న వివరాలను సేకరిస్తున్న ఆయన... దానికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించుకుంటున్నారు. ఈ మేరకు నిన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర సీనియర్ అధికారులతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు... స్పెషల్ స్టేటస్ పద్దు కింద ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.6 వేల కోట్లేనని తేల్చేశారు. ఇదే విషయాన్ని ఆయన రేపటి భేటీలో ప్రధాని ముందు పెట్టనున్నారు. ఈ మేరకు సదరు నిధుల విడుదల, ఇతరాల కోసం కేంద్రం విడుదల చేసిన నిధులు... తదితరాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News