: విజయవాడ పోలీసులు పెద్ద ముదుర్లు... చోద్యం చూస్తూ కూర్చుంటారు!: నన్నపనేని వివాదాస్పద వ్యాఖ్యలు


విజయవాడ సిద్ధార్థ్ నగర్ లో వంద కోట్ల సివిల్ వ్యవహారంలో కుటుంబ సభ్యుల హింసకు గురైన ఒక మహిళకు మద్దతు తెలుపుతూ నగరానికి వచ్చిన టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి విజయవాడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆమె పోలీసులపై మండిపడ్డారు. విజయవాడ పోలీసులు ఎందులోనూ పని చేయరా? అని ఆమె నిలదీశారు. కాల్ మనీ, అయేషా హత్య కేసు.. ఇలా ఏ కేసులోనూ పని చేయడం లేదని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళలను ఇంట్లో బంధిస్తే ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు. విజయవాడ పోలీసులు పెద్ద ముదుర్లని ఆమె మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా విజయవాడ పోలీసులు చోద్యం చూస్తూ కూర్చుంటారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News