: బుల్లి అతిథి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న జుకెర్ బర్గ్
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో బుల్లి అతిథి మాక్స్ (జుకెర్ బర్గ్ ముద్దుల తనయ) సమక్షంలో జుకెర్ బర్గ్ కేక్ కోశాడు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జుకెర్ బర్గ్ సోషల్ మీడియాలో ఫోటోను పోస్టు చేశాడు. కాగా, జుకెర్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు మాక్స్ గత ఏడాది జన్మించిన సంగతి తెలిసిందే. కుమార్తె కోసం పేటర్నటీ లీవు కూడా తీసుకున్న జుకెర్ బర్గ్, కుమార్తెతో గడిపిన ప్రతి సందర్భాన్ని ఫోటోలో బంధించి సోషల్ మీడియాలో పెడుతున్న సంగతి తెలిసిందే.