: నాగశౌర్య, నిహారికల 'ఒక మనసు' టీజర్ విడుదల
నాగశౌర్య, నిహారిక కొణిదెల జంటగా రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ నిర్మించిన 'ఒక మనసు' టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ మాట్లాడుతూ, 'ఒక మనసు' సినిమా అద్భుతమైన దృశ్యకావ్యమని అన్నారు. విశాఖపట్టణం, అరకుల్లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథే హీరో అని, పూర్తి తెలుగుదనం కలిగిన ఆహ్లాదకరమైన సినిమా అని వారు చెప్పారు. గతంలో 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' సినిమాను రూపొందించిన రామరాజు ఉత్తమ అభిరుచి కలిగిన దర్శకుడని, ఆయన ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దారని యూనిట్ తెలిపింది.