: జూన్ 15 నాటికి తాత్కాలిక సచివాలయం రెడీ!... 27 నుంచి ఏపీ పాలన అక్కడినుంచే!: మంత్రి నారాయణ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయం పనులు వచ్చే నెల 15 నాటికి పూర్తి అవుతాయట. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా అదే నెల 27 నుంచి ఏపీ పాలన మొత్తం అక్కడి నుంచే జరుగుతుందట. ఈ మేరకు నిన్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ... అక్కడే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. వర్షం పడినా నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎక్కడికక్కడ శ్లాబ్ లు వేసుకుంటూ వెళుతున్నామని ఆయన చెప్పారు. ఏది ఏమైనా వచ్చే నెల 27 నుంచి అమరావతి నుంచే పాలనను సాగిస్తామని ఆయన చెప్పారు. జూన్ 27 నాటికి 11,500 మంది ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాదు నుంచి అమరావతికి తరలివెళ్లనున్నాయని ఆయన చెప్పారు.