: ఎయిమ్స్ నుంచి సుష్మా డిశ్చార్జీ!... 20 రోజులు ఆసుపత్రి బెడ్ పైనే కేంద్ర మంత్రి!


బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి నేటి ఉదయం డిశ్చార్జీ అయ్యారు. ఛాతీలో నొప్పి, జ్వరం కారణంగా గత నెల 25న సుష్మా ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి సుష్మాను ఆసుపత్రిలోని కార్డియో న్యూరో సెంటర్ లో ఉంచిన వైద్యులు చికిత్స అందించారు. ప్రత్యేక వైద్యుల బృందం అందించిన చికిత్సతో సుష్మా ఆరోగ్యం కుదుట పడిందని, దాంతో ఆమెను నేటి ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా తెలిపారు. అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులుగా సుష్మా ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు.

  • Loading...

More Telugu News