: వెకిలి చేష్టల టీడీపీ కార్పొరేటర్ కు పోలీసుల నోటీసులు?


స్టడీ టూర్ కంటూ వెళ్లి విమానంలో వెకిలి చేష్టలకు దిగిన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. చంటిబాబు వెకిలి చేష్టలపై బాధితురాలు శంషాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చంటిబాబుకు తన సొంతూరు విజయవాడలో నిరసనలు స్వాగతం చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున మీడియా కథనాలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంటిబాబు వివరణ కోరనున్నట్లు శంషాబాదు డీసీపీ తెలిపారు. త్వరలోనే ఈ మేరకు చంటిబాబుకు నోటీసులు జారీ చేయనున్నట్లు డీసీపీ కొద్దిసేపటి క్రితం తెలిపారు.

  • Loading...

More Telugu News