: ప్రత్యేకహోదాపై ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు: కంభంపాటి హరిబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారని పార్లమెంటు సభ్యుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విమర్శించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాతో ప్రయోజనం ఏమిటో ఎవరూ తెలుసుకోవడం లేదని అన్నారు. ప్రత్యేకహోదా వల్ల ప్రభుత్వాలకే ఉపయోగమని ఆయన చెప్పారు. హోదా లేకపోయినా ఆర్థిక ప్యాకేజీల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే ఉపయోగం కంటే ప్రత్యేకప్యాకేజీ వల్ల లభించే సాయం ఎక్కువని ఆయన చెప్పారు.