: తెలంగాణ కల ఎలా సాకారమైందో అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది: హీరో శివాజీ
తెలంగాణ కల ఎలా అయితే సాకారమైందో అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కూడా సాధ్యమవుతుందని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. హోదా సాధనలో వెనక్కి వెళ్లబోమని అన్నారు. బీజేపీని నమ్ముకుంటే మట్టి, నీళ్లు తప్పా ఏపీకి ఏమీ దక్కదని శివాజీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే ఏపీని ముంచేసిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీ రాష్ట్రనాయకులు సాయం చేయాలని ఆయన కోరారు. పోరాడి హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు.