: జేబులోని నేతను ప్రాజెక్టుల కోసం టీఆర్ఎస్ లోకి పంపించి దొంగనాటకాలా?: జగన్ పై దేవినేని నిప్పులు


గీసిన గీత దాటని జేబులోని నేతను ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో కావాలని చేర్చిన జగన్, ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ నిప్పులు చెరిగారు. తెరాసలో పొంగులేటి చేరడాన్ని ప్రస్తావిస్తూ, జగన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే పొంగులేటి ఆ పార్టీలో చేరాడని, అందుకు ప్రతిగా పలువురు వైకాపా నేతలకు కేసీఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చాడని ఆరోపించారు. ఓ వైపు కాంట్రాక్టులను పొందుతూ, మరోవైపు కర్నూలులో దీక్ష చేస్తాననడం జగన్నాటకమని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులను కలిసిన జగన్ ఏం సాధించాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News