: ఏపీ ప్రాజెక్టులను జగన్ అడ్డుకుంటున్నారు: మంత్రి దేవినేని
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు కడప జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు జగన్ అడ్డుతగులుతున్నారని అన్నారు. రైతుల కష్టాలను తీర్చేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషిచేస్తోందని కడప జిల్లా రైతులకు నీరు సరఫరా చేశామని అయినా కూడా జగన్ తమపై ఆరోపణలు చేస్తున్నాడని దేవినేని అన్నారు. తాము చేసే అభివృద్ధి పనులను చూసి జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా 40 టీఎంసీల నీటిని ఆదా చేశామని దేవినేని ఈ సందర్భంగా పేర్కొన్నారు.