: తమిళనాట కంటెయినర్లలో రూ. 765 కోట్లు... ఈసీ దిగ్భ్రాంతి!


మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఎన్నికల కమిషన్ దిగ్భ్రాంతి చెందేలా రెండు కంటెయినర్లలో తరలిస్తున్న రూ. 765 కోట్లు పట్టుబడింది. ఈ ఘటన తిర్పూర్ సమీపంలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల తనిఖీల్లో భాగంగా తిర్పూర్ సమీపంలో సోదాలు జరుపుతున్నప్పుడు ఓ కంటెయినర్ అటుగా వచ్చింది. అనుమానం వచ్చిన వారు దాన్ని ఓపెన్ చేసి చూడటంతో రూ. 1000, రూ. 500 నోట్ల కట్టలు కనిపించాయి. వీటి విలువ రూ. 570 కోట్లు. అవాక్కయిన పోలీసులు వాటిని పరిశీలిస్తూ, ఈసీకి, ఐటీ శాఖకు సమాచారం ఇస్తుండగానే, అదే తరహా మరో కంటెయినర్ పట్టుబడింది. దాని నిండానూ డబ్బు కట్టలే. విలువ రూ. 195 కోట్లు. కరెన్సీ కట్టలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎవరిది? ఎక్కడికి తీసుకువెళుతున్నారన్న విషయమై దర్యాఫ్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇవి బ్యాంకుకు చెందిన డబ్బని వాటిని తీసుకువెళుతున్న వారు తెలిపారు. వీటిని కోయంబత్తూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిపినట్టు సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News