: తిరుమల ఆలయం ముందు మూడేళ్ల వికలాంగ బాలుడు... వదిలెళ్లిన మనసులేని తల్లిదండ్రులు!


తిరుమల ఆలయ మహాద్వారానికి కుడివైపున ఉన్న ఊంజల్ మండపం వద్ద మూడేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఘటన ఈ ఉదయం జరిగింది. బాలుడు వికలాంగుడు కావడంతో, మనసులేని తల్లిదండ్రులే స్వయంగా వదిలేసి వుంటారని భావించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. బాలుడిని స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, అతనికి సంబంధించిన వారు ఎవరైనా వస్తే, అప్పగిస్తామని, లేదంటే శిశు విహార్ కు పంపుతామని తెలిపారు. విషయం తెలుసుకున్న పలువురు భక్తులు స్టేషనుకు వచ్చి బాలుడిని చూసి, తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News