: నెట్ పరీక్ష కేంద్రాలు... ఏపీలో నాలుగు, తెలంగాణలో ఒకటి మాత్రమే!
యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ - విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) ప్రతి సంవత్సరం నిర్వహించే నేషనల్ ఎలిజబులిటీ టెస్ట్ (నెట్) రాయాలని భావిస్తున్న తెలంగాణ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న తెలంగాణ అభ్యర్థులందరికీ హైదరాబాద్ లో ఒకే ఒక్క చోట కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన యూజీసీ, 10 జిల్లాలున్న తెలంగాణకు ఒకటే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.