: బీసీసీఐ బాస్ దాదానా? ఠాకూరా? 22న తేలుతుంది!
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తదుపరి అధ్యక్షుడు ఎవరన్న సస్పెన్స్ ఈ నెల 22న తొలగనుంది. 22న బీసీసీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. మూడు రోజుల క్రితం బీసీసీఐ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్, ఐసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. శశాంక్ తదుపరి బీసీసీఐ పగ్గాలు ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ చేపట్టవచ్చని నిన్నమొన్నటి వరకూ భావించినప్పటికీ, తాజాగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి పదవి దక్కుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.