: విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి పరారైన విజయవాడ కార్పొరేటర్!


ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ విమానంలో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు, ఓ మహిళను వేధించాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫిర్యాదు చేయగా, అప్పటికే చంటిబాబు గన్నవరానికి బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో విషయాన్ని గన్నవరం ఎయిర్ పోర్టు పోలీసులకు శంషాబాద్ పోలీసులు చేరవేయగా, చంటిబాబు తప్పించుకుని పరారైనట్టు తెలుస్తోంది. విమానం ల్యాండింగ్ కన్నా ముందుగానే గన్నవరం పోలీసులకు సమాచారం అందినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన్ను వదిలేసినట్టు విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News