: వరల్డ్ టాప్ కంపెనీగా యాపిల్ ను వెనక్కు నెట్టేసిన గూగుల్
యూఎస్ కేంద్రంగా పనిచేస్తూ, టెక్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న వరల్డ్ టాప్ కంపెనీ యాపిల్ రెండో స్థానానికి పడిపోయింది. గడచిన రెండేళ్లలో తొలిసారిగా ఆ సంస్థ ఈక్విటీ వాటాల విలువ 90 డాలర్లకు తగ్గడంతో, మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీ స్థానాన్ని గూగుల్ ఆక్రమించింది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 494 బిలియన్ డాలర్లుగా ఉండగా, గూగుల్ విలువ 500 బిలియన్ డాలర్లుగా ఉంది. యాపిల్ సంస్థ ఈక్విటీ విలువ ఈ సంవత్సరంలో 14 శాతం వరకూ నష్టపోవడం గమనార్హం. ఐఫోన్ విక్రయాలు తగ్గడమే యాపిల్ నష్టాలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.