: విషయముంటే నేనే చెబుతాను...నచ్చింది రాసేయకండి: మీడియాకు అఖిల్ హితవు


టాలీవుడ్ యువనటుడు అఖిల్ ప్రింట్, ఆన్ లైన్ మీడియా ప్రతినిధులకు హితవు పలికాడు. ట్విట్టర్ మాధ్యమంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీనిని తనదైన శైలిలో చాకచక్యంగా చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే...వంశీ పైడిపల్లి సినిమాలో అఖిల్ నటించనున్నాడన్న వార్తలు ఈ మధ్య కాలంలో హల్ చల్ చేశాయి. వీటిపై ట్విట్టర్ మాధ్యమంగా అఖిల్...'డియర్ ప్రింట్‌ అండ్ ఆన్‌ లైన్‌ మీడియా స్నేహితులారా...నాకు మేనేజర్‌, పీఆర్‌ టీమ్‌ ఉంది. నా గురించిన వార్త ఏదన్నా తెలిస్తే, నా మేనేజర్ లేదా టీమ్ కు పోన్ చేయండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు సమాచారం ఇస్తారు. ఫ్రీగా ఫీలవ్వండి' అన్నాడు. 'ఇలా వాస్తవాలు నిర్ధారించుకోకుండా వార్తలు రాయడం వల్ల ఇబ్బంది కలగడమే కాకుండా మీరు ప్రచురించిన వార్తలతో మీ విశ్వసనీయత దెబ్బ తింటుంద'ని హితవు పలికాడు. వంశీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పిన అఖిల్, ఏదైనా సినిమా గురించి తాను ప్రకటించే వరకు ఎదురు చూడాలని సూచించాడు. 'పోనీ, మీరు ఆకర్షణీయమైన పుకారును లేపారా? అంటే, అదీ కాదు' అంటూ అఖిల్ దెప్పి పొడిచాడు. ఇలాంటి రూమర్స్ బుర్రలేనివిలా అనిపిస్తాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News