: తమిళనాట మరో పరువు హత్య


తమిళనాట వరుసగా పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. మార్చి 13న దళిత యువకుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడన్న కసితో, నడి రోడ్డుపై నరికిచంపిన సంగతి తెలిసిందే. అతని తండ్రిని కూడా గాయపరచడంతో, అతని భార్య నిన్నే ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా తిరునల్వేలి సమీపంలోని దళిత కులానికి చెందిన విశ్వనాథన్ (25) అనే యువకుడు అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి, ఆమెతో వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. దీనిపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో విశ్వనాథన్ ఇంటికి వచ్చి వెతికారు. విశ్వనాథన్ కనపడకపోవడానికి తోడు అతని అక్క కల్పన వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. దీంతో మరింత రెచ్చిపోయిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను నరికి చంపారు. కాగా, వివాహిత అయిన ఆమెకు కూమార్తె కూడా వుంది.

  • Loading...

More Telugu News