: చెప్పులు పక్కన పడేసి ‘కేన్స్’ రెడ్ కార్పెట్ పై అమెరికా తార
కేన్స్ చలనచిత్రోత్సవానికి హాజరయ్యే వారు డిజైనర్ దుస్తుల్లో, హై హీల్స్ తో, ప్రేక్షకులు కన్నార్పకుండా చూసే విధంగా తయారై వస్తుంటారు. అయితే, ఈ చిత్రోత్సవానికి అందుకు భిన్నంగా హాజరైన వారూ లేకపోలేదు. తాజాగా, ఆ జాబితాలో అమెరికా అందాల తార జూలియా రాబర్ట్స్ కూడా చేరుతుంది. ‘కేన్స్’ రెడ్ కార్పెట్ పైకి చెప్పులు లేకుండా వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. జూలియా నటించిన ‘మనీ మాన్ స్టర్’ చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జార్జ్ క్లోనీ, జోడీ ఫోస్టర్ తో కలిసి జూలియా హాజరైంది. రెడ్ కార్పెట్ పై చెప్పులు లేకుండానే ఆమె నడుచుకుంటూ వెళ్లి ఫొటోలకు పోజులిచ్చింది. నటి సుసాన్ సరండన్ కూడా బ్యాలె ఫ్లాట్స్ తో ఈ చలన చిత్రోత్సవానికి హాజరవడం గమనార్హం.