: ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదు: పురంధేశ్వరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ, 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని అన్నారు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందని ఆమె చెప్పారు. ఇఫ్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని ఆమె తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం బీజేపీ చిత్తశుద్ధితో పని చేసిందని, ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని ఆమె గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News