: ప్రియాంకా గాంధీలో నాకు ఇందిరా గాంధీ కనిపిస్తారు: హరీష్ రావత్


ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కుమార్తెలో తనకు ఇందిరాగాంధీ కనిపిస్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఇంకోసారి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను విధించాల్సి వచ్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చురకలు అంటించారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం అసమంజసమని, అసందర్భంగా కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిందని ఆయన మండిపడ్డారు. ప్రియాంకా గాంధీ పార్టీలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆంకాంక్షించారు. కాగా, ఈ మధ్య కాలంలో ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలంటూ డిమాండ్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News