: ఈవ్ టీజింగ్ చేస్తావా..? అంటూ పోకిరీ చెంప ఛెళ్లుమనిపించిన మహిళా పోలీస్.. ఆన్లైన్లో వీడియో హల్చల్
ఈవ్ టీజింగ్ చేస్తావా..? అంటూ ఓ పోకిరీ చెంప ఛెళ్లుమనిపించింది మహిళా పోలీస్. బీహార్‌లో ఓ మహిళా పోలీస్ అందరి ముందు పోకిరీని చితకబాదిన ఈ సన్నివేశం కెమెరా కంటికి చిక్కింది. అనంతరం సోషల్ మీడియాలోకి ఎక్కేసి, హల్చల్ చేస్తోంది. ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన ముందు నుంచి వెళుతోన్న ఓ యువతి పట్ల ఈవ్‌టీజింగ్ కు పాల్పడ్డాడు. ఘటన సమయంలో అక్కడే ఉన్న మహిళా పోలీస్ విషయాన్ని గమనించి ఆటోడ్రైవర్ చెంపలు వాచి పోయేలా.. కొట్టిన చోటే కొడుతూ బుద్ధి చెప్పింది. అనంతరం ఆ వ్యక్తిని పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఈ సన్నివేశాన్ని నెటిజన్లు తెగచూసేస్తున్నారు. మహిళా పోలీస్ చర్యని మెచ్చుకుంటున్నారు. పోకిరీకి మంచి బుద్ధి చెప్పిందని రీ ట్వీట్లు చేస్తున్నారు.