: తమిళనాట తారస్థాయికి 'అమ్మ' పిచ్చి... ఇదిగో ఇలా!


దైవారాధన సంగతి అటుంచితే, తమకిష్టమైన వ్యక్తిని ఆరాధించడంలో తమిళవాసులు ఎంత ముందుంటారో ఎన్నోమార్లు రుజువైంది. మామూలు రోజుల్లోనే అడుగడుగునా ముఖ్యమంత్రి జయలలిత పట్ల అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఆమె సందడి తెలుస్తుంది. అమ్మ పుట్టిన రోజునాడు జయలలిత బొమ్మలను పచ్చ బొట్లు పొడిపించుకున్నారు. కొందరు ఆమెకు మేలు కలగాలని సిలువ కూడా వేయించుకున్న సందర్భాలున్నాయి. ఇక ఆమెకు గుడులు కట్టి పూజిస్తున్నవారూ ఉన్నారు. ఇప్పుడిక ఎన్నికల వేళ, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, తమకు తోచిన విధంగా అమ్మ పట్ల భక్తిని చాటుకుంటున్నారు. ఈ భక్తి కాస్తా ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నట్టుంది. ఓ మహిళ ఏకంగా జయలలిత చిత్రంతో కూడిన పెద్ద చెవి దుద్దులను చేయించుకుని మురిసిపోయింది. జయలలిత బొమ్మ కింద రెండాకుల గుర్తును కూడా చేర్చింది. చెవి చుట్టూ మాటీలు సైతం అమర్చుకుని ప్రచారంలో పాల్గొంది. ఎన్నికలు ముగిసేలోపు ఇటువంటి సిత్రాలు మరెన్ని కనిపిస్తాయో! ఆమెను, ఆమె లోలాకుల అందాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News