: ప్రత్యేక హోదా అన్న పదం చట్టంలో లేదు: ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్
ప్రత్యేక హోదా అన్న పదం చట్టంలో లేదని ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ అన్నారు. ఈరోజు విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అన్న పదం చట్టంలో లేదని, ఏపీకి హోదా ప్రకటించాలంటే చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. చట్టంలో లేకున్నా ఏపీకి నిధులు మంజూరు చేస్తూ రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి అదనపు సాయం కావాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకంటే కేంద్రం ఏపీకి ఎక్కువ మేలే చేస్తోందని సిద్ధార్థ్ నాథ్ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో తమపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కోర్ కమిటీ సమావేశం సందర్భంగా టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలని తమ పార్టీ నేతలకు సిద్ధార్థ్ నాథ్ సూచించినట్లు సమాచారం. కేంద్రం పట్ల టీడీపీ చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది