: కరవు నివారణ చర్యలు చేపడుతున్నామని కేంద్రం గొప్పలు చెబుతోంది.. కానీ చేసిందేమీ లేదు: రఘువీరా రెడ్డి
కరవు నివారణ చర్యలు చేపడుతున్నామని కేంద్రం గొప్పలు చెబుతోందని.. కానీ మోదీ సర్కార్ ఇప్పటి వరకూ కరవు నివారణకు తీసుకున్న చర్యలేమీ లేవని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కరవు పరిస్థితులపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరు పట్ల మండిపడ్డారు. ఇరు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న కరవు పట్ల, తెలంగాణ సర్కార్ అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్టుల పట్ల ఉదాసీన వైఖరి పాటిస్తున్నాయని విమర్శించారు. కరవు పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి తాము రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు రఘువీరా పేర్కొన్నారు.